గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం లోని గన్‌ఫౌండ్రీ డివిజన్ నౌబత్ పహాడ్ బస్తీ లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొర్రి రాధాకృష్ణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సర్వే ద్వారా అర్హుల్కెన ప్రజలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అందరికీ అందుతాయని ,ఈ సర్వే పైన ఎలాంటి అపోహలను నమ్మొద్దని ప్రజలకి తెలియజేశారు. వివక్షను రూపుమాపడానికి ఈ కుల గణనా సర్వే అని, దేశంలోనే మన తెలంగాణ రాష్ట్రం ముందుగా కుల గణన ప్రారంభించి అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలబడిరదని అందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేశారు.
శనివారం సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె.సత్యనారాయణ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ 14 సీనియర్ అధికారి వెంకటగిరి మరియు ఎన్యుమరేటర్ లింగయ్య గోషామహల్ నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొర్రి రాధాకృష్ణ మరియు ఇతర కార్యకర్తలు, బస్తీ వాసులు పాల్గొన్నారు.