సీఎం రేవంత్‌ రెడ్డి వేములవాడ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ ప్రజాబలం ప్రతినిధి:వేములవాడ పట్టణంలోని గుడి చెరువు ఆవరణంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ, జౌళి శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ శ్రీధర్‌, టూరిజం శాఖ ఎండి హనుమంతు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ రa, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ గార్లతో కలసి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్‌ సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అత్యవసరమని సూచించారు. దేవాలయ పరిసరాల్లో శుభ్రత, భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు అన్నింటిపై ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రికి వేములవాడ దేవాలయం విశిష్టత, చరిత్రను వివరించే ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ రa పర్యటన సమయానికి అన్ని పనులను పూర్తి చేయడానికి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ గారు భద్రతా ఏర్పాట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ప్రతిష్టాత్మకమైన ఈ పర్యటనలో వేములవాడ రేపటికి మరింత గుర్తింపు తీసుకొస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆది శ్రీనివాస్‌ అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking