పేదల గొంతుకగా.. పేదల మనిషిగా సీఎం చంద్రబాబుకు సోదరుడిగా.. ప్రతిక్షణం మంచికోసం.. మంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం పరితపించిన వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు అని.. అలాంటి వ్యక్తి హఠాత్తుగా కన్నుమూయడం బాధాకరమని టీడీపీ నేతలు విచారం వ్యక్తం చేశారు.. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. రామూర్తినాయుడి చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లు మాట్లాడుతూ.. రామ్మూర్తి నాయుడు మానవతావాది అని.. ఆయన అందరిని కలుపుకొని పోయే వ్యక్తి అని.. అందరి తలల్లో నాలుకలా ఉండే వ్యక్తి అని.. ప్రజల మనిషి అని.. టీడీపీ గెలుపుకోసం ఆయన ఎంతో పరితపించారన్నారు. దుర్మార్గం నశించి రామరాజ్యం రావాలని ఆశపడిన వ్యక్తి రామూర్తి నాయుడన్నారు. ఆయన మంచి తనం ఆయన్ను ప్రజల గుండెల్లో ఉంచిందన్నారు.. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని.. ఆయన అమరుడైనా.. ప్రజలు ఎప్పుడూ ఆయన్ను మరచిపోరని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేట్ అథారిటీ ఛైర్మన్ శ్యావల దేవదత్, గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, హ్యాడ్ లూమ్ కోఆపరేటీవ్ చైర్ పర్సన్ సజ్జా హేమలతా, మౌనార్టీ సెల్ ప్రెసిడెంట్ ముస్తాక్ అహ్మద్, మీడియా కోఆర్డినేటర్ ధారపనేని నరేంద్రబాబు, బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాంప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతర్ల రమేష్, టీడీపీ కేంద్ర కార్యాలయ రిసెప్షన్ ఇన్చార్జ్ హాజీ హసన్ బాషా, ఎన్ఆర్ఐ సెల్ చప్పిడి రాజశేఖర్, పార్టీ నాయకులు శంకర్ నాయుడు, రవియాదవ్, ములక సత్యవాణి, పీరయ్య సుభాషినీ తదితరులు పాల్గొని నివాళ్లు అర్పించారు.