భారీ సంఖ్యలో హాజరుకానున్న పూర్వ విద్యార్థులు
వివరాలను వెల్లడించిన కర్నాటి కృష్ణ
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 29 (ప్రజాబలం) ఖమ్మం అక్టోబర్ 1వ తేదీన గవర్నమెంట్ శాంతినగర్ హైస్కూల్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ మహా సమ్మేళనం నిర్వహించనున్నట్లు పూర్వ విద్యార్థి సంఘం గౌరవ అధ్యక్షులు కర్నాటి కృష్ణ, అధ్యక్షులు భోగా గిరి, ప్రధాన కార్యదర్శి ఎం ఏ తౌపిక్ తెలిపారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1975 నుండి 1985 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభమయ్యే మహా సమ్మేళనం పార్క్ కన్వెన్షన్స్ ఆల్ (గొరిల్లా పార్క్)లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ మహా సమ్మేళనానికి 40 సంవత్సరాల క్రితం చదువుకున్న దాదాపు 1000 మంది విద్యార్థులు ఒకే చోటికి చేరి వారి అనుభవాలను పంచుకుంటారని, ఈ మహా సమ్మేళనానికి పూర్వ విద్యార్థులైనా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాత మధులతోపాటు అనేకమంది ప్రజాప్రతినిధులు వివిధ హోదాలలో ఉన్న పూర్వ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమ్మేళనంలో తమకు విద్య నేర్పి తమ భవిష్యత్తును నిర్దేశించిన గురువులకు కృతజ్ఞతా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సలహాదారులు బానోతు బస్కి నాయక్, పిల్లి విజయపాల్, ఉమ్మినేని రాంబాబు, జయరాజ్, అబ్దుల్ ఖలీక్, భవాని, పిల్లలమర్రి శ్రీనివాస్, శ్రీగాధ శ్రీనివాస్, బండారి శ్రీనివాస్, గౌస్ బాయ్, సివిఆర్ శ్రీనివాస్, భూపాల్, జనార్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.