ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 29 (ప్రజాబలం) ఖమ్మం భద్రాచలం, సత్తుపల్లి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రోడ్డు భవనాల శాఖ మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి తో కలిసి పర్యటిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో నేరుగా గుబ్బగుర్తి చేరుకుంటారని గుబ్బగుర్తిలో ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ ప్రారంభిస్తా రని అనంతరం ఖమ్మంలో 1350 కోట్ల రూపాయ ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రారంభోత్సవాలు చేస్తారని తెలిపారు. అక్కడ నుంచి భద్రాచలం, సత్తుపల్లి, వైరా నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఖమ్మం నుంచి హైదరాబాద్ హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారని తెలిపారు.