ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ
ప్రజారక్షణ-పోలీస్ భాద్యత
పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 08 : షీ టీమ్స్,సైబర్ క్రైమ్,టి-సేఫ్ యాప్,చైల్డ్ లైన్,గంజాయి కి సంబందించిన ఏదైనా సమాచారం,ఆపద సమయంలో పోలీస్ సహాయం కోసం,ప్రజల్లో చైతన్యం కల్పించడానికి రూపోందిన వాల్ పోస్టర్‌ను గురువారంరోజున సిపి కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ… పెట్రోల్ కార్,బ్లూ కోల్ట్స్ సిబ్బంది నిరంతరం 24×7 గస్తీ నిర్వహిస్తూ,ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో వుంటూ ఎవరైనా అనుకోనిఆపదలో చిక్కుకున్న సమయంలో డయల్ 100 కాల్ చేస్తే వెంటనే సత్వర స్పందన కలిగి తమను కాపాడేందుకు పోలీసులు వస్తారని భరోసా కల్పిస్తూ సాంకేతిక పరిజ్ఞానంను వినియోగిస్తూజిపిఎస్ మ్యాప్ ఆధారంగాబాధితులను క్షణంలో చేరుకొని తక్షణ సహాయం అందించడం జరుగుతుంది.మహిళలు చిన్న పిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, మహిళల భద్రత,ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు షిటీమ్స్,ఆధ్వర్యంలో విద్యార్థినీలు,మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటున్నారని రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ అన్నారు. ఎవరైనా వేధించిన, రోడ్డుపైవెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన,ఉద్దేశపూర్వకంగా వెంబడించిన విద్యార్థినిలు,మహిళలు అత్యవసర పరిస్థితులలో రామగుండంపోలీస్ కమిషనరేట్ పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712656597, షీ టీం నెంబర్ 6303923700 కికాల్ చేసి, వాట్సాప్ ద్వారా సందేశం పంపించి లేదా డయల్ 100 కు కాల్ చేసి తక్షణ పోలీస్ సహాయం పొందాలని సూచించారు.మహిళలు,చిన్నారుల భద్రత కోసం,ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో భద్రతకు తక్షణ సహాయం అందించడానికి,లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి,ప్రయాణమార్గం నావిగేట్ చేయడానికి,ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లతో టీ- సేఫ్టీ యాప్ రూపొందించారని ఇట్టి యాప్ ను అందరు ఉపయోగించుకోవలన్నారు.గంజాయికి బానిసలుగా మారి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకొంటుందని దాని వలన వారి జీవితాలు విచ్చిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురైవుతున్నారని,గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి,రామగుండం కమిషనర్ పరిధిలో గంజాయి,మత్తు పదార్థాల అక్రమ రవాణా,సరఫరా,క్రయ,విక్రయాలకు పాల్పడేవారి,పేకాట,కోడి పందాలు ఆడేవారిపై,గుడుంబా తయారీ,అక్రమ రవాణా,ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసేవారి, ఇల్లీగల్ ఫైనాన్స్, భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం, ఇతర చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాల సమాచారాన్ని పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712656597, 8712656607 లకు ఇవ్వాలని, పాల్పడే వారిపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గొప్యంగా వుంచబడుతాయని సిపి గారు తెలిపారు.సాదారణగా ప్రజలు అత్యాశ, అమాయకత్వం వలన సైబర్ నేరాలకు గురి అవుతున్నారని అనారు. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు.అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి మోసపోకుండా అప్రమత్తంగా .ఏదైనా సైబర్ నేరగాని చేతిలో మోసపోయిన వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని సిపి గారు కోరారు.అడిషనల్ డిసిపి అడ్మిన్ సి.రాజు ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇంచార్జి యస్.ఐ. వి. హైమ, పెద్దపల్లి షీ టీమ్ ఇంచార్జ్,ఏ.యస్.ఐ.మల్లన్న,సిబ్బంది కానిస్టేబుల్స్ సతీష్,శ్రావణ్ కుమార్, సురేష్,మహిళా కానిస్టేబుల్స్ జ్యోతి, స్నేహాలత పాల్గొన్నారు