సంగారెడ్డి ఆగష్టు 08 ప్రజ బలం ప్రతినిధి :డి అశోక్.సదాశివపేట మొన్న వారం రోజుల క్రితం కేరళలోని వైనాడు ప్రాంతంలో భారి అకాల వర్షాలకు ఆ ప్రాంతంలోని భారీగా ఆస్తి నష్టము ప్రాణాష్టం జరిగింది. సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు అలాంటి వారికోసం మానవ దృక్పథంతో సిపిఐ సదాశివపేట పట్టణ సమితి కార్యదర్శి పీ వినోద ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ అకాల వర్షాలకు సర్వస్వం కోల్పోయి దాదాపు 150 మంది చనిపోయారు అలాంటి అభాగ్యుల కోసం మానవతా దృకుదతంతో షాప్ టు షాప్ తిరిగి విరాళాలు సేకరించడం జరిగింది ప్రజల నుండి కాస్త మిశ్రమ స్పందన లభించింది ఎవరైతే ఆపదలో ఉంటారో మానవత్వ కోణంతో అలాంటి వారిని ఆదుకోవడంలో సిపిఐ ముందుంటుంది అన్నారు. అందరూ విరివిరిగా విరాళాలు ఇవ్వాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో సాధకలి ముస్తఫా యాకోబు పోచయ్య పూలమ్మ శంకరమ్మ రాజమణి దేవి బాయ్ తస్లిం రైసా బేగం తదితరులు పాల్గొన్నారు.