సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో 500 పడకల ఆసుపత్రి కి శంఖు స్థాపన.

 

వైద్య వృత్తి పవిత్ర మైనది – వృత్తి కి న్యాయం చేయాలి

వైద్య వృత్తి లో బాధ్యత – జవాబు దారితనం కల్గి ఉండాలి.

తెలంగాణ లో ప్రతి పౌరునికి నాణ్యత తో కూడిన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ ధేయం

ఆరోగ్య రీత్యా సంగారెడ్డి గుండెకాయ లాంటిది.

*దవాఖానా పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి .

ప్రైవేటు దవాఖానా లు మెడికల్ చట్టాలను పాటించాలి

— తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ఆగష్టు 08 ప్రజ బలం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ వార్డును మంత్రి పరిశీలించారు . ఆసుపత్రిలో శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని పరిశుభ్రత పాటించాలని ఆసుపత్రి సూపర్డెంట్ కోసం సూచించారు. ఈ సందర్భంగా మెడిసిన్ స్టాక్ రూమ్ లో డయాలసిస్ సెంటర్ ని మంత్రి పరిశీలించారు. నిర్మాణం లో ఉన్న మెడికల్ కళాశాలను పరిశీలించారు.ప్రభుత్వ మెడికల్ కళాశాల లో అధ్యాపకులతో మేడికో లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో 500 పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన చేసుకుందామన్నారు. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని , దానిని బాధ్యత జవాబుదారితనంతో నిర్వర్తించాలన్నారు. రోగులతో సమిష్టిగా కలిసిపోతూ వైద్య వృత్తికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులకు సూచించారు. తెలంగాణలో పేదవానికి, జబ్బు పడ్డ ప్రతి పౌరునికి నాణ్యతతో కూడిన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. సంగారెడ్డి చుట్టుపక్కల నుంచి వచ్చే నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యరీత్యా సంగారెడ్డి గుండెకాయ లాంటిదని అన్నారు. దవాఖానా పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేటు దవాఖానాలు ఇష్టారాజ్యంగా వైద్యం చేయకుండా మెడికల్ చట్టాలను పాటించాలని సూచించారు. జిల్లా హాస్పిటల్ లో అన్ని పరికరాలు యంత్రాలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ దవాఖానా లో వైద్యం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ దవఖానాలో అనుభవం గల వైద్యులు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. డయాలసిస్ బెడ్లు పెంచాలని , రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దవఖాన ఆవరణలో పెండింగ్ లో ఉన్న హాస్టల్ భవనాలను,అసంపూర్తిగా ఉన్న భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు , ట్రై నీ కలెక్టర్ మనోజ్ , టి జి ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గరెడ్డి , మునిసిపల్ చైర్మన్ విజయలక్ష్మి , ఆర్ డి ఓ వసంత కుమారి, డి ఏం ఈ డా ఎన్. వాణి, జి జి హెచ్ సూపరెంటెండెంట్ డా. అనిల్ కుమార్, జి ఏం సి ప్రిన్సిపాల్ డా ‘సుధా , డి ఏం &హెచ్ ఓ డా. గాయత్రీ , టి పి సి సి ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking