మల్కాపూర్ లో ప్రారంభమైన శివ పంచాయతనం శ్రీ దుర్గా మల్లేశ్వర విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం.

 

మాల్కాపూర్, తూప్రాన్, ఫిబ్రవరి, 15. ప్రాజబలం ప్రతినిధి.

మెదక్ జిల్ల తూప్రాన్ మండలం మల్కాపూర్ లో నూతనంగా అమిరిశెట్టి సతీష్ కుమార్, వీణ లు నిర్మించిన శివ పంచాయతనం, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు శనివారం ఉదయం 8 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గురువంధనం, వేధస్వస్తి, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య, ప్రాషణ, ఋత్విగ్వరణం, యాగశాల ప్రవేశం, ఆఖండదీప స్థాపన, వాస్తు పూజ, నవగ్రహ సహిత సర్వతిభద్ర మండపారాధన, ప్రధాన కలశ స్థాపన , సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, మూల మంత్ర జపములు, జలాదివాసం, ప్రదోష కాల పూజలు, హారతి, మంత్ర పుష్పం, తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమం అమీరిశెట్టి సతీష్ కుమార్, వీణ పుణ్య దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా పూజలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మల్కాపూర్ గ్రామ ప్రజలు పుర ప్రముఖులు, పరిసర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking