శివ సేవ సేన పార్టీ ఆద్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ కి ఘనంగా నివాలి

హైదరాబాద్ సెప్టెంబర్ 27 ();ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతి పురస్కరించుకొని శివ సేవ సేన పార్టీ ఆద్వర్యంలో ట్యాంక్ బండ్ పై గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అణువణువూ స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్దత కలిగిన రాజకీయ వేత్త,స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించి నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారు. బాపూజీని స్ఫూర్తిగా తీసుకుని యువత ఆదర్శంగా నిలవాలని తెలంగాణ కోసం ఉద్యమం చేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం జరిగింది.. బడుగు, బలహీనవర్గాల స్పూర్తి ప్రధాత, స్వాతంత్రోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ఆయన చూపిన పోరాట పటిమ మరువలేనిదన్నారు.ఈ కార్యక్రమం లో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్బంగా ఏ సుదర్శన్ శివసేన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగౌట్ గణేష్ శివసేన తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి .బొట్టు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి వికాస్ మనోజ్ గోపాల్ పావని శ్రీ లత కవిత రాజేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking