ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమకారుడు స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి పురస్కరించుకొని నెలకొండపల్లి మండలం కేంద్రంలో బీసీ జేఏసీ పాలేరు నియోజకవర్గ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగినది ఈ కార్యక్రమం లో బీసీ జేఏసీ నియోజకవర్గ అధ్యక్షులు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమం లో ఆయన చూపిన స్ఫూర్తి మరువలేనిది నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారాని గుర్తుచేసుకొన్నారు ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి అధ్యక్షుడు కార్యదర్శి తోగిటి నాగచారి, పిట్టల సూరిబాబు, బీజేపీ మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు సయ్యద్ మోహినూద్దీన్ఉద్యమ నాయకులు బచ్చలకూర శ్రీను, తదితరులు పాల్గొన్నారు