శివనామ స్మరణతో మారుమ్రోగిన శివాలయాలు

ఉపవాస దీక్ష పారవశ్యంతో మాహా శివరాత్రి వేడుకలు

భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు.

శివపార్వతుల ధర్షణానికై క్యూ లైన్ లో భారులు తీరిన భక్తులు

తూప్రాన్, ఫిబ్రవరి,26. ప్రజాబలం ప్రతినిధి :-

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం తెల్లవారుజామున అత్యంత మహిమాన్వితమైన శివాలయంలో పరమ పవిత్రమైన శివుని అనుగ్రహం కోసం రుద్రాభిషేకం తో పాటు అర్చనలు, హారతులు, తీర్థ ప్రసాదాలు వితరణ జరిగింది. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమ్రోగింది. భక్తులు ఉపవాస దీక్ష పారవశ్యంతో మాహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తూప్రాన్ లోని శివాలయం, మల్లిఖార్జున్ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడాయి. ఉపవాస దీక్షలు చేస్తున్న భక్తులు శివపార్వతుల ధర్షణానికై క్యూ లైన్ లో భారులు తీరారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయ ప్రధాన అర్చకులు వేదపండితులు మధు పంతులు మాట్లాడుతూ
మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ లలో ఒకటి అని తెలిపారు. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు అని, ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు హిందువులు పవిత్రంగా భావించి ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు చేసి ఖర్జూర పండు, కొబ్బరి నీళ్లతో ఒకపొద్దు యిడుస్తారు. శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో రోజుని మహాశివరాత్రి పండుగ ను జరుపుకుంటారని అన్నారు. అధ్బుతమైన శివుని రేయి” మహాశివరాత్రి అనేది భారతదేశ ఆధ్యాత్మికతలో ఎంతో ప్రముఖమైంది. ఈ రాత్రి ఎందుకు అంత ప్రముఖమైందో ఇంకా దానిని ఎలా ఉపయోగించుకోవాలనే విషయాన్నీ మధు పంతులు వివరించారు. భారత సంస్కృతిలో సంవత్సరానికి 365 పండుగలు ఉండేవి. ఈ 365 పండుగలు వేర్వేరు కారణాలకి ఇంకా జీవితంలోని వేర్వేరు ప్రయోజనాల కోసం సూచించబడ్డాయి అని అన్నారు. వారు వివిధ చారిత్రక సంఘటనలు, విజయాలుకు సూచనగా లేదా విత్తనాలు నాటడం ఇంకా పంటకోత వంటి జీవితంలో కొన్ని సందర్భాలను వేడుకగా జరుపుకునేవారు. ప్రతీ సందర్భానికి ఒక పండుగ ఉండేది. కానీ మహాశివరాత్రికి మాత్రం ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి – మార్చ్ లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మహాశివరాత్రి ఎంతో ప్రముఖమైనది. కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి, ప్రపంచంలో గాఢమైన ఆకాంక్ష ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ఆవశ్యకం. కుటుంబ పరిస్థితులలో నివసించేవారు, మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. ప్రాపంచిక లక్ష్యాలతో ఉన్నవారు, ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. కానీ సన్యాసులకు మాత్రం ఈ రోజు ఆయన కైలాష పర్వతంతో ఒకటయిన రోజు. ఆయన పరిపూర్ణ నిశ్చలత్వంతో, పర్వతంలా అయిపోయాడు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు. ఇతిహాసాలను పక్కన పెడితే , ఈ రోజు ఇంకా రాత్రికి యోగ సాంప్రదాయంలో ఇంత ప్రాముఖ్యత , ఆధ్యాత్మిక సాధకునికి ఇది కల్పించే అవకాశాలు వలన వచ్చిందే. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎన్నో దశల అధ్యయనం తరువాత ఈరోజున మీకు ఏమని నిరూపిస్తున్నారంటే – మీకు జీవంగా తెలిసిన ప్రతీదీ, మీకు తెలిసిన ప్రతీ పదార్థం ఇంకా ఉనికి, మీకు తెలిసిన జగత్తు ఇంకా పాలపుంతలు, ఇవన్నీ కూడా కేవలం ఒకే శక్తి వివిధ లక్షల రూపాల వ్యక్తీకరణ అని. ఈ శాస్త్రీయ వాస్తవం ప్రతి యోగిలో ఒక అనుభవపూర్వక వాస్తవికత. “యోగి” అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించినవాడని. నేను “యోగ” అన్నప్పుడు, దానర్థం నేనేదో ఒక అభ్యాసమో లేక పద్ధతి గురించో మాట్లాడటంలేదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలనే అన్ని కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురుంచి తెలుసుకోవాలనే వాంఛలు ఉంటే – అదే యోగ. దీనిని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుందనీ ఉద్ఘాటించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking