ఎమ్మెల్సీ ఎన్నికలపై సబ్బని ప్రభావం

– 20వేల మందితో వెంకట్ జూమ్ మీటింగ్

– అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా కార్యాచరణ

హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 25

ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ జెన్ ప్యాక్ట్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ ప్రభావం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలంగా పడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. వెంకట్ 20వేల మంది పట్టభద్రులతో జూమ్ మీటింగ్లో పలు విషయాలపై దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, జిల్లాల పరిధిలోని పట్టభద్రులు పెద్ద ఎత్తున ఆన్లైన్ జూమ్ మీటింగ్ లో పాల్గొని సబ్బని వెంకట్ సందేశాన్ని తీసుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు నిరుద్యోగ సమస్యలపై పోరాడే సామర్ధ్యము ఉండకపోవచ్చు అని, అసలు వారు సమస్యల పరిష్కారంపై పోరాడగలరా? నిరుద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్లు అభివృద్ధి తదితర విషయాలపై బలంగా నిలబలగలరా? అంశాలపై ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు గంటల వ్యవధి ముందర అభ్యర్థులకు సబ్బని వెంకట్ టెన్షన్ కుట్టుకుందనే చర్చ సైతం రాజకీయ వర్గాల్లో జరుగుతుండడం గమనార్హం. దీంతోపాటు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయాలని విషయంలో.. సబ్బని వెంకట్ కోడ్ లాంగ్వేజ్ లో సందేశం పంపిస్తారా? ఒకవేళ పంపితే అది ఏ మేరకు ఎవరి పేరు ప్రభావితం చూపుతుంది? అనేది చర్చనీయాశంగా మారింది. నిరుద్యోగ సమస్యల మీద చిత్తశుద్ధితో పోరాడే వారికి మాత్రమే పట్టభద్రులు నిరుద్యోగులు మద్దతు తెలుపాలనే విధంగా సభని వెంకట్ చివరకు సందేశం ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతూ ఉండడం ద్వారా ఎమ్మెల్సీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా.. రాజకీయ వర్గాల్లో టాప్ నడుస్తోంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూస రాజకీయానికి చెక్ పెట్టేలా సభను వెంకట్ వ్యూహం ఉంటుందనేది వారి అనుచరు ద్వారా తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking