పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

జియాగూడ ఫిబ్రవరి 25(ప్రజాబలం) భారత అభ్యుదయ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1997-98 బ్యాచ్ విద్యార్థిని, విద్యార్థులు పాఠశాలలో వారు చదివి 26 వసంతాలు పూర్తయిన సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో సిల్వర్ జూబ్లీ సమావేశంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఒకరినొకరు పాత రోజులు గుర్తు చేసుకుని సంతోషంతో భోజనం చేసి గడపడం జరిగింది భవిష్యత్తులో తోటి విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఎత్తకుండా ఉండాలని ఉద్దేశంతో స్నేహం స్నేహితుల కోసం ఒకరి ఒకరు అండగా ఉంటామన్నారు పలువురు పూర్వ విద్యార్థులు ఆనాటి స్మృతులను గుర్తుచేసుకొని భావోద్వేగానికి గురయ్యారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయురాలు వై గిరిజాకుమారి, జె దేవేందర్,కే ఎన్ బాలాజీ, హెచ్ కిషన్ జి, శేఖర్ రెడ్డి, తుల్జానంద్, సాయి దేవి, జి చంద్రశేఖర్, జె అజయ్ కుమారి, పూర్వ విద్యార్థులు జి నరేందర్, పి రాకేష్, పి అశ్విన్, వి శివకుమార్,ఎస్ బీరప్ప, కే శ్రీధర్, వి ప్రమోద్ కుమార్, ఏం శివకుమార్, సి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking