* ఉపాధ్యాయ సమస్యలు తెలిసినటువంటి విజ్ఞానవంతులను ఎన్నుకొండి.
* శాసనమండలి పంపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిది.
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 25
ఫిబ్రవరి 27వ తారీకు నాడు ఉపాధ్యాయ మిత్రులందరు ఆలోచించి ఓటు వేయవలసి ఉంటుందని,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లో పోటీ చేసే వ్యక్తులు ఈసారి కార్పొరేట్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల నుండి రావడం బాధాకరమైన విషయమని ఉపాధ్యాయ సమస్యలు తెలిసినటువంటి విజ్ఞానవంతులను ఎన్నుకొని శాసనమండలి పంపించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క ఉపాధ్యాయుని పైన ఉందని గత 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ రంగంలో ఉంటూ ఉపాధ్యాయ సమస్యల పైన పూర్తి అవగాహన కలిగిన వై. అశోక్ కుమార్ అనే నాకు మీ మొదటి ప్రధాన్యత ఓటు వేసి గెలిపించి ఉపాధ్యాయ సమస్యల పైన గొంతు విప్పి మాట్లాడేందుకు అవకాశం కల్పించగలరని జమ్మికుంట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వై అశోక్ కుమార్ తెలియజేశారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ఇచ్చి వారిని శాసనమండలి పంపేందుకు సంసిద్ధంగా ఉన్నాయని ఉపాధ్యాయులు అందరూ ఆలోచించి ఓటు వేయాలని
బి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొమ్ము రమేష్ తెలిపినారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలబడిన తిరుపతి టి పి టి ఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య, టిపిటిఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి అవినాష్, టి పి టి ఎఫ్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు సిహెచ్ పోశయ్య, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పరశురాములు, టి పి టి ఎఫ్ సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు శ్రీ పూల రాజమౌళి, దేవానందం, సార్భద్రస్వామి, నేదురు కనకయ్య, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.