ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం

హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 25

కరీంనగర్ నిజాంబాద్ అదిలాబాద్ మెదక్ ఉమ్మడి ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీజారిటీతో గెలిపించాలని జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం పట్టపద్రులకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు ట్యూషన్ చెప్పుకునే స్థాయి నుండి విద్యా వ్యవస్థ స్థాపించి అనేకమంది విద్యార్థులను ప్రయోజకులను చేసి ఉన్నత స్థాయిలో నిలబడటంలో నరేందర్ రెడ్డి కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇచ్చిన అనేక హామీలను ఒకటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెట్టి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులను దరఖాస్తులు స్వీకరణ చేస్తుందని త్వరలోనే ప్రతి ఒక్క కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తుందని అన్నారు. దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలక్షన్లప్పుడు మాత్రమే తెలంగాణలో హడావిడి చేస్తుంది తప్ప పేదలకు బిజెపి ప్రభుత్వం చేసింది ఏం లేదని అన్నారు. తెలంగాణలో బిజెపికి ఉనికి ఏమాత్రం లేదని ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని పట్టభద్రులు మేధావులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పుల్లూరి స్వప్న-సదానందం పట్టభద్రులను కోరారు. రానున్న రోజుల్లో విద్యార్థులు పట్టబద్రులు రైతులు పేర్కొన్న సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణబ్ బాబు సహాయ సహకారాలతో వారి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking