ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, పిబ్రవరి 25:
డ్రీమ్ యోగ అండ్ ఫిట్నెస్ సొసైటీ ఆధ్వర్యంలో మందమర్రి పట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ఈ పోటీల్లో వివిధ విభాగాల్లో పాల్గొని విజేతలైన పోటీదారులకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి జనరల్ మేనేజర్ దేవేందర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఇందులో పురుషుల విభాగం గ్రాండ్ ఛాంపియన్షిప్ ను కొంపెల్లి రమేష్ గారు,మహిళా విభాగం గ్రాండ్ ఛాంపియన్ షిప్ ను సోనియా బిస్వాస్ గారు దక్కించుకున్నారు. మరియు ఇతర విభాగాల్లో పాల్గొని విజేతలైన క్రీడాకారులకు అతిథులుగా విచ్చేసిన ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి కనపర్తి రమేష్, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బిఅరెస్ పట్టణ అధ్యక్షుడు జె. రవీందర్, కాంగ్రెస్ బిసి సెల్ నాయకుడు కొత్తపెల్లి రమేష్ బహుమతులు ప్రధానం చేశారు.
పురుషుల విభాగం విజేతలు
6-10 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి రిషి పటేల్, రెండవ బహుమతి ప్రణీత్, మూడో బహుమతి జయదేవులోయ ఆందుకున్నారు.
11-15 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి సుద్దాల శ్రీధర్, రెండవ బహుమతి రిషి వర్ధన్, మూడో బహుమతి సిహెచ్ కళ్యాణ్. అందుకున్నారు.
21-25 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి జి. మనోహర్, ఆందుకున్నారు.
41-45 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి డి హరిబాబు, రెండవ బహుమతి ఎస్ శ్రీనివాస్ అందుకున్నారు.
46-50 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి గంప అనిల్
51-55 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి బి వేణుగోపాల్, రెండవ బహుమతి బి సదానందం, మూడో బహుమతి మద్ది శంకర్.
లు అందుకున్నారు.
56-60 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి కొంపెల్లి రమేష్, రెండవ బహుమతి బి మల్లేశం, మూడో బహుమతి ఎం దామోదర్ లు ఆందుకున్నారు.
61-65 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి ఏం రాజ కొమురయ్య, రెండవ బహుమతి పి రామ బ్రహ్మచారి, మూడో బహుమతి కనకయ్య లు అందుకున్నారు.
మహిళా విభాగం విజేతలు
11-15 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి మోక్ష శ్రీ, రెండవ బహుమతి తేజశ్రీ, మూడో బహుమతి కీర్తి సాహిత్య
16-20 విభాగంలో సంవత్సరాల కే వర్షిని, జి మానస, పి వేదశ్రీ
21-25 విభాగంలో సంవత్సరాల మొదటి బహుమతి శిరీష, రెండవ బహుమతి పద్మ.
26-30 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి డి లత, రెండవ బహుమతి అద్వైత, మూడో బహుమతి స్రవంతి.
31-35 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి మామిడి రాధిక, రెండవ బహుమతి అర్చన, మూడవ బహుమతి కే స్వాతి.
36-40 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి డి రాజమణి.
41-45 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి కే పద్మ, రెండవ బహుమతి స్వర్ణలత, మూడవ బహుమతి పి గీత.
46-50 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి ఆదిలక్ష్మి, రెండవ బహుమతి ఊర్మిళ, మూడో బహుమతి కృష్ణవేణి, శ్రీదేవి.
51-55 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి జె సంపూర్ణ , రెండవ బహుమతి బి సుశీల, మూడో బహుమతి కే వినోద గార్లు విజేతలుగా నిలిచారు. అదేవిధంగా సూర్య నమస్కారాల్లో పాల్గొన్న 16 మంది విజేతలకు కూడా బహుమతులు ప్రధానం చేశారు.
అనంతరం అతిథులను యోగ మాస్టర్ , డ్రీమ్ యోగ సొసైటీ ఫౌండర్ ముల్కల్ల శంకర్ ని యోగ సభ్యులందరూ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్లు ,బర్ల సదానందం ,కొంపెల్లి రమేష్ , నిర్వాహకులు బడికల సంపత్ ,మద్ది శంకర్ ,లయోలా కుమార్ ,ఎగ్గేటి రాజేశ్వరరావు , పోలు సంపత్ ఎగ్గేటి రాజమౌళి ,డి.ఎస్.రావు, దామోదర్ , ముల్కల్ల సాయి, సిద్ధం సత్యం, బొంతు త్రిమూర్తి, పూసాల ఓదెలు, సాదుల సాంబయ్య మరియు యోగ అభ్యసకులు వారి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
