ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ పిబ్రవరి 19:
మందమర్రి పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతిని హిందు బాంధవుల ఆధ్వరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ నుంచి మార్కెట్ మీదగా పాల చెట్టు అక్కడి నుండి తిరిగి పాత బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు ధైర్యానికి, ధీరత్వానికి మరో పేరు శివాజీ అని పలువురు పేర్కొన్నారు. సమాజ హితం కోసం పని చేసిన శివాజీ మహరాజ్ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ వేడుకలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.