ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 19 : మంచిర్యాల జిల్లాలోని లక్షెటిపేట మండలంలోని హనుమంతుపల్లి.గ్రామంలో బుధవారం ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో పురుగు మందులు పిచ్చకారి చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్ఎం.మహేష్. మాట్లాడుతూ…వివిధ రకాల పంటలకు మందు పిచికారి చేసేటప్పుడు గాలికి ఎదురుగా స్ప్రే చేయరాదని, చిన్నపిల్లలతో స్ప్రే చేయించవద్దని,ముఖానికి హెల్మెట్,నోటికి మాస్క్, చేతులకు గ్లౌజులు,కళ్ళజోడు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.స్ప్రే చేసిన అనంతరం చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని మందులు వాడడం వల్ల మనుషులపై, భూమిపై పంటలపై పడే ప్రభావం గురించి క్లుప్తంగా వివరించారు.ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు.గడ్డం కొమరయ్య. చీకటి తిరుపతి. రైతులు పాల్గొన్నారు