నిధుల దుర్వినియోగంపై షోకాజ్ నోటీసు ?

 

జీవన్ రెడ్డి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం

జగిత్యాల, సెప్టెంబర్ 27: జాభితాపూర్ గ్రామంలో వివిధ పనుల్లో జరిగిన 11 లక్షల 8 వేల 148 రూపాయల దుర్వినియోగంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం విచారణ చేపట్టారు. పీఆర్ విభాగం అధికారులు చేపట్టిన విచారణంలో 11 లక్షల 8 వేల 148 రూపాయల పనులపై అబ్యాంతరాలను వ్యక్తం చేశారు. ఇదే నివేదికను కలెక్టర్ కు సమర్పించగా 15 రోజుల్లోగా దుర్వినియోగమైన నిధులను పంచాయతీ ఖాతాలో జమచేయాలని లేకుంటే పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోరదంటూ కలెక్టర్ ఆ గ్రామ సర్పంచ్ కు షోకాజ్ నోటీసు జారిచేసినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking