ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక 10వ డివిజన్ లో రూ10లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంఖుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరం అభివృద్ధి లో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అన్ని డివిజన్లలో సిసి రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపి లు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఏఎంసి చైర్ పర్సన్ దొరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ చావా మాధురినారాయణ రావు, మునిసిపల్ ఇఇ లు రంజిత్, కృష్ణలాల్, డిఇ రంగారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.