ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ పై గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ లు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యే లు బానోత్ హరిప్రియ నాయక్, రాముల్ నాయక్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, పోలీసు కమీషనర్ విష్ణు వారియర్, సుడా చైర్మన్ బచ్చు బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దొరేపల్లి శ్వేత, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, బిసి సంఘం నాయకులు తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం అధికారంగా నిర్వహిస్తున్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 108వ జయంతోత్సవం కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి వారు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు. బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను ఆయన స్మరించుకున్నారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తితోనే కేసీఅర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం ను సాధించారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్ర బడ్జెట్లో నేతన్నలకు రూ. 500 కోట్లు కేటాయించారని, నేతన్నలకు భీమా పథకం అమలు చేస్తున్నట్లు, అణగారిన బడుగు బలహీన వర్గాలకు మహర్దశ వచ్చిందని మంత్రి తెలిపారు కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమర్తపు మురళి, బొమ్మ రాజేశ్వరరావు, పగడాల నాగరాజు, సంఘం నాయకులు చిలకమర్రి శ్రీనివాస్ బాబు, బెండెం జనార్ధన్, బండారు శ్రీనివాస్, సత్యనారాయణ, పిల్లలమర్రి కొండల రావు, సంపత్ శివరామకృష్ణ, సుగుణకర రావు, తదితరులు ఉన్నారు.