అంగన్వాడీ సమ్మెపై ప్రభుత్వ నిర్లక్ష్యం విడాలి

17 వ రోజున అంగన్వాడీల వంటా వార్పు

ప్రభుత్వం అంగన్వాడీ యూనియన్లతో చర్చించాలి

సిఐటియు రాష్ట్ర నాయకులు ముకుంద రెడ్డి

జగిత్యాల, సెప్టెంబర్ 27: తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్నీ వీడి యూనియన్లతో చర్చించి సమనపనికి సమాన వేతనం చెల్లించాలని సిఐటియు రాష్ట్ర నాయకులు ముకుంద రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట 17వ రోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. అనంతరం వంటా వార్పులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముకుంద రెడ్డి మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీల సమ్మె నేటికి 17 వ రోజుకు చేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూనియన్ నాయకులతో చర్చించాలని సమస్యను పరిష్కరించాలని కోరారు. కనీస వేతనం 26 వేలు ఇస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కో కన్వీనర్ ముడుగం రాజలింగం, అంగన్వాడీ టీచర్లు సరిత, స్వప్న, శారద, కళావతి, గంగజమున, జ్యోతి, సౌజన్య, మమత, రజిత, పద్మలతోపాటు టీచర్లు, ఆయాలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking