తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ

బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత

…. టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్

సంగారెడ్డి, సెప్టెంబర్ 27 ప్రజ బలం ప్రతినిది
ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తి తో ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ 108 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఫల పరిశోధన కేంద్రం వద్ద గల ఆయన విగ్రహానికి రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీనవర్గాల స్ఫూర్తిదాతయని అన్నారు. మహనీయుల సేవలు,చరిత్రను భావితరాలకు తెలియజేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే మహనీయుల జయంతి, వర్ధంతులను ప్రభుత్వంఅధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు.
అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయ సమావేశ మందిరంలో ( పాత జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ) ఏర్పాటుచేసిన ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవ కార్యక్రమంలో టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పిసిఈఓ, డిఆర్ఓ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జడ్పీ సీఈవో ఎల్లయ్య
మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ పాత్ర పోషించారని, అందరూ వారి సేవలను స్మరించు కోవలసిన ఆవశ్యకత ఉందన్నారు.1969వ సంవత్సరంలో తొలి దశ పోరాటం లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని వారి సేవలను కొనియాడారు.
డిఆర్ఓ నగేష్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని, వారి జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని, మానవీయ విలువలు, సంస్కృతి, నైతిక విలువలు ,ఆదర్శ వ్యక్తి త్వం కలిగిన వ్యక్తని కొనియాడారు.
ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు, బడగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేశారని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీష్, జిల్లా పద్మశాలి సంఘం
అధ్యక్షులు మాకం మల్లేశం, ప్రధాన కార్యదర్శి కొప్పెరి వెంకట హరి హర కిషన్, కోశాధికారి పోల పుండరీకం, ముఖ్య సలహాదారు గొంట్యాల పండరి, ఉపాధ్యక్షులు నక్క రాఘవులు, యాగ్ని మురళి, బూస మల్లేశం, ఉడుత ఆనంద్ కుమార్, మునిపల్లి విశ్వనాథం, మహిళా అధ్యక్షురాలు భోగ విజయలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ లక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొడపాక యాదగిరి,నక్క కృష్ణమూర్తి, బలభద్ర విద్యాసాగర్, చెన్న బాలకిషన్, సహాయ కార్యదర్శి గంజి జానకిరామ్, వడిగచర్ల కిషన్, తాటికొండ అశోక్, శ్రీధర్, నరసింహులు, కృష్ణ, పాముల రాజు, సంగపురం రాజేంద్రప్రసాద్, బీరా యాదవ్, మాణిక్యం, రమేష్ గౌడ్, కూన వేణుగోపాల్, విద్యార్థులు, బిసి సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking