ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఆగస్టు 26 : మంచిర్యాల నియోజకవర్గం లోని లక్షెట్టిపేట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు,గోపిక వేషధారణలతో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు అలరించాయి.అనంతరం విద్యార్థుల కేరింతల నడుమ ఉట్టి కొట్టే కార్యక్రమం జరిగింది.కృష్ణుడు, గోపికల వేషధారణతో హాజరైన విద్యార్థుల మధ్య కృష్ణాష్టమి వేడుకలను కోలాహలంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి చింత అశోక్ కుమార్,ఉపాధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, సలహా సమితి ఏంబడి రామన్న,పోషకులు, పాఠశాల ప్రధానాచార్యులు లావణ్య,ఆచార్యులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గోన్నారు.