రాష్ట్రంలో మేదో సంపత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి దేశానికి ఉపయోగపడేలా చేస్తాం: భట్టీ విక్రమార్క

హైదరాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి:గతంలో ఏ ప్రభుత్వము ఆలోచించని రీతిలో రేవంత్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఆలోచిస్తుంది.. ఈ రాష్ట్ర యువత దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తుంది
యువతను ప్రోత్సహించేందుకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సింగరేణి అధికార బృందాన్ని అభినందిస్తున్నాను
ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ లకు ఐదువేల కోట్లు కేటాయింపు విద్యపై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తుంది… అంగన్వాడీ ల నుంచి యూనివర్సిటీల వరకు ప్రత్యేక దృష్టి సారించాం
యూనివర్సిటీ విద్య పరిశ్రమలకు ఉపయోగపడేలా స్కిల్‌ యూనివర్సిటీ స్థాపించాము
యూపీఎస్సీ ప్రిలిమ్స్‌ పాసై మెయిన్స్‌ ప్రిపేర్‌ అవుతున్న మిమ్మల్ని అభినందించేందుకు మీకు ఆర్థిక ప్రోత్సాహకాలని అందించేందుకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.
ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మేధో సంపత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉపయోగపడేలా కార్యక్రమాలను మన ప్రజా ప్రభుత్వం నిర్వహిస్తుంది.
గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన వారెవరు ఆలోచించని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తం ఆలోచన చేస్తోంది.
మన రాష్ట్రం నుంచి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మెయిన్స్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు.. అందులో ఉత్తీర్ణులై ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ఈ నేపథ్యంలో వారికున్న కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులునైన తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.
రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము.
ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ఎనర్జీ శాఖను, సింగరేణి కాలారీస్‌ సంస్థను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
ఈ కార్యక్రమం రాష్ట్రంలో విద్యావ్యాప్తితో పాటు, రాష్ట్రానికి కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని భావిస్తున్నాము.
ప్రిలిమ్స్‌ లో ఎంపికై ఇక్కడున్న వారంతా మెయిన్స్‌ కి ఆ పైన ఇంటర్వ్యూలకి హాజరై, సివిల్‌ సర్వీసెస్‌ కి ఎంపిక అవ్వాలని కోరుకుంటున్నాను. మీరంతా రాష్ట్రంలోనూ, లేదా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ సేవలు అందిస్తున్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంపై మీరు ప్రత్యేకమైన ఆలోచన చేస్తారని నేను నమ్ముతున్నాను.
చరిత్రలో తొలిసారి విద్యకు సంబంధించిన అనేక అంశాలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టంది.
రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో ఎవరు ఆలోచన చేయని విధంగా యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు ఏర్పాటు దిశగా ముందుకు వెళుతుంది.
అందులో భాగంగా తొలి ఏడాదే ఐదు వేల కోట్ల రూపాయలతో రూపాయల నిధులతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు ఖర్చు చేస్తుంది.
గత ప్రభుత్వం రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ కు కేవలం ఏడాదికి రూ. మూడు కోట్లు మాత్రమే మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేసింది. ఈ సంవత్సరం మేము మూడు కోట్ల రూపాయలను నుంచి రూ.5 వేల కోట్లకు మా ప్రభుత్వం పెంచింది.
ఈ కేటాయింపులే మా ప్రభుత్వ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తుంది
అంగన్వాడీలు, హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌, యూనివర్సిటీల వరకు మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది.
యూనివర్సిటీలో ఉన్న సిలబస్‌, పరిశ్రమల అవసరాలకు సంబంధం ఉండడం లేదు. అంతేకాక గ్లోబలైజేషన్‌ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో.. పరిశ్రమలకు అవసరమైన సిలబస్‌ ను తయారు చేసే పనిలో భాగంగా చరిత్రలో తొలిసారిగా స్కిల్‌ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
ఈ స్కిల్‌ యూనివర్సిటీలో పరిశ్రమలకు సంబంధించిన గొప్ప వారిని భాగస్వాములుగా చేస్తూ.. ఆనంద్‌ మహేంద్రా ను చైర్మన్‌ గా నియమిస్తూ.. వారు రూపొందించిన సిలబస్‌ ని బోధించి విద్యార్థులను సాంకేతిక నైపుణ్యపరంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది.
రాష్ట్రంలోని దాదాపు 63 ఐటిఐ కళాశాలలు మూసివేత దిశలో ఉన్నాయి వాటికి కొత్త జవసత్వాలు కల్పించేలా అడ్వాన్స్డ్‌ స్కిల్‌ సెంటర్లుగా అప్డేట్‌ చేస్తున్నాం.
దేశంలో ప్రఖ్యాతిగాంచిన టాటా కమ ఇతర ముఖ్యమైన పరిశ్రమలను ఇందులో భాగస్వాములుగా చేస్తూ ఐటిఐలను స్కిల్‌ సెంటర్లుగా అప్‌ గ్రేడ్‌ చేస్తున్నాం.
రాష్ట్రంలో ఉన్న మానవవనరులను పెద్ద ఎత్తున ప్రోత్సహించి.. తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి దేశాభివృద్ధికి దోహదం చేసేలా కార్యక్రమాలను రూపొందించి ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking