గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: ఉస్మానియా దంత వైద్యశాలకు వచ్చే రోగులకు కార్పొరేట్ కు ధీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని నూతనంగా ప్రిన్సిపాల్‌గా నియమితులైన డాక్టర్ ఎస్ ఎస్ యాదవ్ అన్నారు. గత 30 ఏళ్లుగా ఇదే కళాశాలలో కన్జర్వేటివ్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నా నన్నారు. ఈ సందర్భంగా కళాశాలలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.