ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతి చక్ర అవార్డులు ఈ నెల 24 రోజున ఆర్టీసీ కళాభవన్ లో అర్హులయినా అధికారులకు ఉద్యోగులకు అందచేసారు.
రాష్ట్రములోనే మొట్టమొదటి బెస్ట్ డిపోమేనేజర్ గా నిర్మల్ డిపో కు చెందిన ప్రతిమా రెడ్డి కి దక్కింది.
2 వ బహుమతి కూడా తనకే దక్కింది.ఆర్టీసీ సంస్థకే తలమణికం
రోల్ ఆప్ హనర్ గుర్తింపు లభించింది.తను ఈ రోజు నిర్మల్ డిపోకు వచ్చినందులకు డిపో ఉద్యోగులు గణ స్వాగతం పలికారు.తనపై పూల వర్షం కురిపించారు.శాలువలతో మెమంటాలతో సత్కరించారు.
నిర్మల్ డిపో ను అగ్రస్థానములో నిలిపినందులకు అందరు శుభాకాంక్షలు తెలియ చేశారు.డిపోమేనేజర్ మాట్లాడుతూ నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చింది మీరు.మీరు కష్టపడితేనే నాకు ఈ రోజు అరుదయినా గౌరవం దక్కింది.ఈ డిపో ముందుకెళ్లడానికి మీ పట్టుదల అంకితం భావం కృషి వెల లేనిది.నాకు అవార్డు రావడం కంటే రాబోయే ఆరు నెలల కాలములో నిర్మల్ డిపోను రాష్ట్రములోనే ఫస్ట్ డిపో గా తీర్చి దిద్దుదాం.సమిష్టి కృషితో పనిచేద్దాం స్టేట్ ఫస్ట్ డిపో అవార్డు తీసుకుందామని తెలిపారు.కర్తక్రమములో అసిస్టెంట్ మేనేజర్ ఐ.రాజశేఖర్,అసిస్టెంట్ ఇంజనీర్ ( ఎమ్) నవీన్ కుమార్ ఆర్నింగ్ సెక్షన్ గ్యారేజీ సెక్షన్ డ్రైవర్లు కండకర్లు పాల్గొన్నారు