సింగరేణి మైనింగ్ సూపర్ వైజర్ పై ప్రయివేటు కంపనీ భౌతిక దాడి

 

-చోద్యం చూస్తున్న యాజమాన్యం.

మందమరి ఏరియాలోని కళ్యాణి ఖనీ ఓసి మైన్ లో బ్లాస్టింగ్ కు సంబంధించిన ఐడియల్ కంపనికి చెందిన ప్రయివేటు ఉద్యోగులు కేకె హెడ్ ఓవర్మెన్ ల పై దౌర్జన్యంగా భౌతిక దాడులు చేసి ప్రయత్నం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం ఏఐటీసీ నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఓవర్మేన్ యొక్క డ్యూటీలో భాగంగా పై అధికారుల ఆజ్ఞల ప్రకారం డ్యూటీ చేయవలసి ఉంటుందని, అయితే బ్లాస్టింగ్ కు సంబంధించిన రికార్డ్స్ మరియు మినిమేట్ రికార్డ్స్, ఎక్సప్లాసివ్స్ సంబంధించిన రికార్డ్స్ సంతకాలు చేయవలసి ఉంటుందని అయితే అట్టి రికార్డ్స్ సరిగ్గా లేవని,. ఐడియాలు కంపనీ ఉద్యోగులు బలవంతంగా సంతకం పెట్టించే ప్రయత్నం చేశారన్నారు. సరిగ్గా లేని రికార్డ్స్ పైనా సంతకం పెట్టనని అన్నందుకు ఐడియాలు కంపనీ చెందిన ఎంప్లాయీస్ ఓవర్మణ్ బెదిరిస్తూ, నీ అంతూ చూస్తాం అంటూ అరుస్తూ గొడవకు దిగి రచ్చ రచ్చ చేసి తన్నే ప్రయత్నం చేసినారు. కాబట్టి ఇట్టి సంఘటనను మేనేజర్ మెంటు దృష్టి కి తీసుకువేలితే కొందరు అధికారులు పట్టించు కోకుండ వ్యవహరించటం మూలంగా గురువారం మైన్ వద్ద మైనింగ్ స్టాఫ్ అంతా కలిసి నల్ల బాడ్జెస్ ధరించి నిరసన తెలియ చేయడం అయినది.మరి ఉత్పత్తి ఉత్పాదకత విషయం లో ముందు ఉండే ఫ్రంట్ లైన్ సూపర్విస్సర్స్ అయిన మాకు రక్షణ లేదన్నారు. ముందు ముందు ఈ విధంగా ఉంటే ప్రయివేటు కాంట్రాక్టర్ల తోని ఉత్పత్తి విషయంలో మనుగడ లేకుండా పోతుందన్నారు. కాబట్టి ఇందుకు కారణం అయిన ప్రయివేటు ఉద్యోగుల పైనా కఠిన మైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే సింగరేణికి కాంట్రాక్టర్ల ద్వారా ప్రైవేట్ ఉద్యోగులద్వార మనుగడ లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి వంగరి రాజేశ్వర రావు, మందమర్రి మైనింగ్ స్టాఫ్ ఇన్చార్జి గోపతి సత్యనారాయణ, ఏఐటీయూసీ బిపిఏ రీజియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి అడ్డు శ్రీనివాస్, మందమర్రి బ్రాంచి ఏఐటీయూసీ ఇన్చార్జి ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, కేకే ఓసి అసిస్టెంట్ పిట్ కార్యదర్శి రాజేష్ యాదవ్ లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking