సారు. పసల్ బీమా ఎప్పుడు ఇస్తావు సార్..

 

ప్రజాబలం- మెదక్ జిల్లా ప్రతినిధి
24 ఆగస్టు 2024:

ఆపత్కాలంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా పథకం అమలుకు నోచుకోవడం లేదు
ఈ సీజన్‌లో అయిన పథకం అమలు చేస్తారా..? లేదా? అనేది ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. గతంలో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 40 శాతం, రాష్ట్రం 40 శాతం, రైతులు 20 శాతం ప్రీమియం చెల్లించాలనే ఆదేశాలు ఉన్నాయి. కానీ గత ప్రభు త్వం పథకాన్ని పక్కన పెట్టడంతో ప్రతికూల పరిస్థితుల్లో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు.
పంట చేతికొచ్చే సమయంలో నష్టం
వానాకాలం సాగు ప్రారంభమై రెండు నెలలవుతున్నా నేటికీ ఫసల్‌ బీమా పథకానికి మార్గదర్శకాలు విడుదల కాలేదు. దీంతో పంటలకు బీమా ఉందా లేదా..? అని రైతుల్లో ఆందోళన మొదలైంది. గతేడాది పంటలు చేతికొచ్చిన సమయంలో భారీ వర్షాలు పడడంతో పంటలు దెబ్బతిని కొంతమంది రైతులు నష్టపోయారు. ఇలాంటి తరుణంలో పంటలకు బీమా కల్పిస్తే రైతులకు కొంతలో కొంత ఆసరా ఉంటుంది. కాని పత్తి, పెసర, మినుము వంటి పంటలకు సంబంధించి జూలైలోనే గడువు ముగిసింది. వరి పంటకు మరికొద్ది రోజుల సమయం ఉంది. ఈ సమయంలో పథకం గడువు పొడిగిస్తారా? రాబోయే సీజన్‌లో అమలు చేస్తారా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత కరువైంది.
ఈసారి కష్టమే..!
ప్రస్తుత వానాకాలం సీజన్‌ మొదట్లో సరైన వర్షాలు పడలేదు. దీంతో పంటల సాగు ఆలస్యమైంది. ఆగస్టులోనే వరిసాగు అధికంగా జరిగింది. ఈ సమ యంలో బీమా ఎలా వర్తింపజేస్తారని తెలి యని ప రిస్థితి. వానాకాలం మరో రెండు నెలలు మాత్రమే ఉంది. ఈలోపు భారీ వర్షాలకు కురిస్తే పంట చేతికందే సమయంలో నష్టపోవాల్సి ఉంటుంది. గడువు పెంచి పథకం అమలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లాలో పంటల సాగు ఇలా..
జిల్లాలో వానాకాలం 3.73 లక్షల ఎకరాల్లో సాగువుతుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు 2.27 లక్షల ఎకరాల్లో వరి, జొన్న 29.22 ఎకరాలు, మొక్కజొన్న 1,578 ఎకరాలు, పత్తి 36,155, చెరుకు 14.34 ఎకరాలు, స్వీట్‌కార్న్‌ 122 ఎకరాల్లో సాగు అయిందని వ్యవసాయ అధికారులు తెలిపారు. మార్గదర్శకాలు రాలేదు
ఫసల్‌బీమా అమలుకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. రాగానే రైతులకు అవగాహన కల్పించి, పంటల బీమాకు చర్యలు చేపడుతాం.
గోవింద్‌, డీఏఓ

Leave A Reply

Your email address will not be published.

Breaking