వ్యవసాయ అధికారి బదిలీపై వెళుతున్న ఘనంగా ఘనంగా వీడ్కోలు,నూతన వ్యవసాయ అధికారికి ఘనంగా స్వాగతం

 

ఏవో ప్రభాకర్ రెడ్డి సేవలు అభినందనీయం

డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య.

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 24 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండల వ్యవసాయ అధికారి గా ప్రభాకర్ రెడ్డి రైతులకు 11 సంవత్సరాలు చేసిన సేవలు అభినందనీయం అని డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య అన్నారు.శనివారం స్థానిక రైతు వేదికలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడుకోలు నూతన ఏవో శ్రీకాంత్ కి స్వాగత సమావేశం నిర్వహించి సాలువతో సన్మానించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ…ఏవో ప్రభాకర్ రెడ్డి 11 సంవత్సరాలు రైతులకు చేసిన సేవలు మండల రైతాంగం మర్చిపోలేనిదని అన్నారు.రైతులకు వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా రైతులకు వివరిస్తూ లోటుపాట్లను ఎప్పటికప్పుడు తెలుపుతూ మండల రైతులందరికీ తలలో నాలికలా ఉండేవారన్నారు. మండల నూతన ఏవో గా శ్రీకాంత్ కూడా మండల రైతంగానికి ఉత్తమ సేవలందించాలని రైతులందరూ కోరుకుంటున్నమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏవోలు దండేపల్లి రంజిత్,హాజీపూర్ టి మహేందర్,మంచిర్యాల డి కృష్ణ,జైపూర్ లాన్సర్, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఆరిఫ్,పిఎసిఎస్ డైరెక్టర్ కాసు సురేష్, లక్షెట్టిపేట ఫర్టిలైజర్ అసోసియేషన్,ఓనర్స్ రమేష్,ప్రభాకర్,ప్రశాంత్, ప్రభాకర్,శ్రీధర్,బాపు, మురళి,వీరనారాయణ, వేణుగోపాల్, సత్యనారాయణ,శ్రీను,సంపత్,నరేష్,సీఈఓ విష్ణు, గ్రోమర్ రాకేష్, వివిధ మండల ఫర్టిలైజర్ ఓనర్స్, మీసా శ్రీనివాస్, చంద్రమౌళి,అత్తె సుధాకర్,శ్రీనివాస్, చంద్రశేఖర్,రంజిత్, సత్యనారాయణ,రాజయ్య బత్తుల సాయి,కిషన్, కాంతయ్య,భూషణ్,వివిధ ఫర్టిలైజర్స్ యజమానులు,అగ్రి ఎంప్లాయిస్ అసోసియేషన్స్ సభ్యులు,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నీలిమేల రాజు, పాయల శంకర్,వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking