మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
బహుజన్ సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండల ఇంచార్జి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కానుగుల రమణాకర్ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి బుగ్గ స్వామి గారి అధ్యక్షత యావపూర్ గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కటికల ఓం ప్రకాష్ హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రధానంగా సిరిసిల్ల సింహగర్జన సభతోపాటు, ఎన్నికల వేళ తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో పార్టీ బలోపేతం కోసం
ఏ విధంగా పనిచేయాలని గ్రామ కమిటీ,బూత్ కమిటీ నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. అదే విదంగా సిరిసిల్ల సింహ గర్జన సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ నియోజకవర్గ కార్యదర్శి కోట మహేందర్ ,కోశాధికారి మొండి కర్ణాకర్ , తూప్రాన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ , ఉపాధ్యక్షులు కొమ్ము చంద్రం , కుమార్ మరియు గ్రామ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.