ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్లను స్వీకరించాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: రాష్ట్ర శాసనసభకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో జిల్లాలోని ఐదు నియోజక వర్గ రిటర్నింగ్ కార్యాలయాల వద్ద నామినేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు విజయేందర్రెడ్డి, అభిషేక్ అగస్త్య, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఆర్వోలు, ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి నామినేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల స్వీకరణ, వాటి పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణ వంటి అంశాలు చాలా కీలకమైన ప్రక్రియలని, వాటిపై కుణ్ణంగా అవగాహన పెంపొందించుకోవాలని, నామినేషన్ల ప్రక్రియ కోసం చేయవలసిన పనులు, రిటర్నింగ్ అధికారి కార్యాలయం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, సిబ్బంది ఎవరెవరు ఏ పనులు నిర్వహించాలనేది ముందే ఏర్పాటు చేసుకొని పూర్తి ప్రణాళికతో పనులు పూర్తి చేయాలని, కంప్యూటర్స్, స్కానర్, ఫాక్స్, ఓటరు జాబితా, సిసి టివి, వీడియోగ్రాఫర్, వాల్ క్లాక్, పబ్లిక్ అడ్రన్ సిస్టమ్ మైక్ తప్పనిసరిగా ఉండాలని, అకౌంట్ రిజిస్టర్స్, ఎంసిసి గైడ్లైన్స్, స్పీడ్ ఎక్కువగా ఉన్న ఇంటర్నెట్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. బ్యారికేడింగ్ వ్యవస్థ పక్కాగా ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేషన్లు స్వీకరించే మొదటి రోజు నుంచి ప్రక్రియ ముగిసే చివరి రోజు వరకునామినేషన్ కు సంబంధించి 144 సెక్షన్ అమలులో ఉంటుందని ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కార్యాలయానికి వంద మీటర్ల దూరం వరకు దారిని, మూసివేయాలని వాహనాలను అనుమతించరాదని ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో నలుగురికి మొత్తం ఐదురికి మాత్రమే అనుమతించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు. అలాగే నామినేషన్ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేయించాలని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉదయం 11 గంటల కంటే ముందు మధ్యాహ్నం 3 గంటల తర్వాత నామినేషన్లను స్వీకరించరాదని సమావేశంలో అధికారులను ఆదేశించారు. నామినేషన్ల స్కృటిని ఎక్కడ ఎప్పుడు నిర్వహిస్తారనే సమాచారాన్ని అభ్యర్థులకు తెలియజేయాలని, అందకు కావాలసిన ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలన్నారు, సాయంత్రం 3.00 గంటలు దాటిన తర్వాత నామినేషన్లు స్వీకరించరని తెలియజేయాలని,3 గంటల లోపు వచ్చిన వచ్చిన వారికి రిటర్నింగ్ అధికారి సంతకం చేసిన స్లిప్స్ అందించాలని తెలిపారు. నామినేషన్ స్వీకరణ తేది, సమయం తప్పనిసరిగా నమోదు చేయాలని, ఎస్.సి., ఎస్.టి. అభ్యర్థికి 5 వేల రూపాయలని, మిగతా వారికి పది వేల రూపాయలు ధరవాతు చెల్లించాలని తెలిపారు. జిల్లాలోని ఆర్వో కార్యాలయాల్లో వ్యయ పరిశీలన, సీ– విజిల్, కంట్రోల్రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు బ్యానర్లను ఏర్పాటు చేయాలని తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సమావేశంలో ఆర్వోలు, ఈఆర్వోలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.