సీతారామ ఎన్ఎస్పి ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం ప్రతినిధి జూలై 27 (ప్రజాబలం) ఖమ్మం సీతారామ, ఎన్ఎస్పి ప్రాజెక్టుల లింక్ కెనాల్ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏన్కూరు మండలం హిమాంనగర్ వద్ద శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సహకారంతో ఎర్త్ వర్క్స్ పూర్తయినట్లు, స్ట్రక్చర్ ల పనులు తుది దశలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. సుమారు 70 కోట్ల ఖర్చుతో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టని ఆయన తెలిపారు. పనులు ఆగకూడదని, లేబర్, మెషినరీ పెంచి పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగించి, ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నాటికి పనులు పూర్తి అయ్యేలా కార్యాచరణ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు ఉన్నారు.