పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కూసుమంచిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
ఖమ్మం ప్రతినిధి జులై 27 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కూసుమంచి మండలం పాలేరులో డ్రెయినేజీల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అనంతరం జుజ్జుల్ రావు పేటలో, తురకగూడెం నుంచి కిష్టాపురం వరకు, తురకగూడెం నుంచి చింతల తండా గ్రామాల వరకు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో చెక్కుల పంపిణీ
మధ్యాహ్నం 12:30 గంటలకు కూసుమంచి లోని క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారని తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఖమ్మంలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో జరిగే సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ రాయల చంద్రశేఖర్ సంస్మరణ సభ కు , ఎస్ ఆర్ కన్వెన్షన్ లో జరిగే శేషు కుమార్ సంవత్సరీకానికి మంత్రి