బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

 

కాంగ్రెస్ నాయకుల డిమాండ్

శరవేగంగా నియోజకవర్గం అభివృద్ధి పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ

విజన్ ఉన్న నాయకుడు పీ ఎస్ ఆర్ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్

బీజేపీకి 8 సీట్లీ స్తే కేంద్రం ఇచ్చిన నిధులు సున్నా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27 : బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ రావు వెర్రబెల్లి పై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. శనివారం ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడారు.ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి చూసి రఘునాథ్ రావు కంటగింపుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు.టూరిస్ట్ గా అమెరికా నుంచి వచ్చి అప్పుడప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు.బడ్జెట్ లో 300 కోట్ల పై చిలుకు నిధులు జిల్లా కు కేటాయించగా నిధులు రాలేదని ప్రజలను పక్కదారి పట్టించే కుట్ర చేయడం శోచనీయమని అన్నారు.మంచిర్యాల నియోజకవర్గంలో కరకట్టల నిర్మాణం, ఎత్తిపోతల
పథకంకు ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు తీసుకువచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావుకు దక్కిందని అన్నారు. ఇప్పటికే రెండుసార్లు ఓటమి చవి చూసిన రఘునాథ్ రావు ముచ్చటగా మూడవసారి కూడా ప్రజల చేతిలో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రఘునాథ్ రావు ఢిల్లీకి వెళ్లి సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేయాలి తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పని చేస్తున్న ప్రేమ్ సాగర్ రావు పై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,మండల నాయకులు,పట్టణ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking