కలెక్టరేట్ లో నిర్మిస్తున్న ఇంకుడుగుంతల నిర్మాణ పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి జూలై 27 (ప్రజాబలం) ఖమ్మం సహజ వనరుల నిర్వహణలో భాగంగా కలెక్టరేట్ నిర్మిస్తున్న ఇంకుడుగుంతల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ శనివారం తనిఖీ చేశారు. భూగర్భ జలాల వృద్ధికి ఇంకుడుగుంతలు ఎంతో దోహదం చేస్తాయని అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వద్ద చేపడుతున్న బస్ షెల్టర్ నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ పరిశీలించారు. ప్రజలు, ఉద్యోగుల సౌకర్యం కొరకు కలెక్టరేట్ వద్ద అన్ని బస్సులు ఆగేలా చర్యలు చేపట్టినట్లు అదనపు కలెక్టర్ అన్నారు బస్ షెల్టర్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన అధికారి వెంకట రమణ అధికారులు తదితరులు ఉన్నారు