ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 27: మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట నూతన తహసీల్దార్ గా ఏ.దిలీప్ కుమార్ శనివారం తహసీల్దార్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు.ఇక్కడ తహసీల్దార్ గా పని చేసిన రాఘవేంద్ర రావు కలెక్టర్ ఆఫీస్ కు బదిలీ అయ్యారు.ఈ సందర్బంగా నూతన తహసీల్దార్ మాట్లాడుతూ… ప్రజలకు అందుబాటులో ఉంటూ,ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.