ప్రజావాణిలో ఆర్డీవో నాగేష్ ను నిలదీసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్
సంగారెడ్డి మార్చ్ 20 : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో ప్రజా సమస్యలను పరిష్కరించే వేదికను ఆశ్రయించిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఆర్డీవో నాగేష్ ను నిలదీశారు.ధర్మ పోరాటంలో భాగంగా స్వతంత్ర సమరయోధుడి పది ఎకరాల భూ సమస్యను పరిష్కరించడంలో ప్రజావాణి వేదిక అధికారులైన సంగారెడ్డి జిల్లా ఆర్డీవో నాగేష్ గారితో మాట్లాడుతూ స్వాతంత్రం సాధించుకొని 75 సంవత్సరాలు గడిచినా కూడా స్వతంత్ర సమరయోధుడికి కేటాయించిన పది ఎకరాల భూమి కబ్జా పట్టా పాస్ బుక్కులు ఇవ్వడంలో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయం నిర్లక్ష్యం వహించడం పట్ల మండిపడ్డారు. అదేవిధంగా ఇకపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన మరో స్వతంత్ర ఉద్యమ బాటలో , ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ ఆశయాల స్ఫూర్తితో ఉద్రిక్తంగా రాష్ట్రవ్యాప్తంగా , దేశవ్యాప్తంగా స్వతంత్ర ఉద్యమ ఆందోళనలు చేపడుతామని దేనికైనా సిద్ధమే అని హెచ్చరించారు. ఇట్టి విషయంలో దయచేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ ప్రత్యేకమైన చొరవ తీసుకొని సమస్యను వెంటనే పరిష్కరించాలని సత్యనారాయణ గౌడ్ . మీడియా మిత్రుల సమక్షంలో ప్రజావాణి సమక్షంలో ప్రజావాణి అధికారులను డిమాండ్ చేసారు