ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 20 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని మామిడిపల్లి గ్రామానికి చెందిన గుడికందుల అనిల్ ఇటీవల రోడ్డు ప్రయాణంలో మృతి చెందడంతో వారి కుటుంబానికి (జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్) ఆధ్వర్యంలో 6 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అనిల్ కుటుంబ సభ్యులకు అందజేసారు,ఈ సందర్భంగా జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ…ఇంక ఎవరైనా దాతలు యువజన సంఘాలు ముందుకు వచ్చి ఓసహాయం చేయాలని మాట్లాడారు.ఈ సహాయ కార్యక్రమంలో గడ్డం రామ్ చందర్, ఎంపిపి గడ్డం శ్రీనివాస్,ఎంపిటిసి ముత్తె రాజన్న,మాజీ వైస్ ఎంపిటిసి ఆకుల రాజేందర్,తదితరులు పాల్గొన్నారు.