_టిడిపి జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న
_
జగిత్యాల, మార్చి 20: ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నేటి తెలంగాణా టిడిపి పాలనలోనే అభివృద్ధి చెందిందని చేసిన అభివృద్ధిని చూసి టీడీపీని ఆదరించాలని టిడిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న కోరారు. టిడిపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు సోమవారం జగిత్యాల లో ఇంటింటి పర్యటన చేపట్టి టిడిపి హయాంలో చేపట్టిన అభివృద్ధిపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజన్న మాట్లాడుతూ 10 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో 9 ఏండ్ల తెరాస పాలనలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏమిలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే ముందుండడం వెనక ఆనాడు టిడిపి పాలనలో చేసిన అభివృద్ధి కారణమన్నారు. 2014 లో రాష్ట్రం మిగులు బడ్జెట్ లో ఉంటే నేడు లోటు బడ్జెట్ లోకి చేరిందని రాజన్న అన్నారు. నేటి తెలంగాణ అంతా అవినీతి, కుంభకోణాలతో నిండిపోయిందన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెరాస పాలనలోని అభివృద్ధిని 2004 వరకు అధికారంలో ఉన్న టీడీపీ చేసిన అభివృద్ధిపై ప్రజలు బేరీజు వేసుకోవాలని రాజన్న కోరారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టిడిపిని అధికారంలోకి తేవాలని ఓటర్లను టిడిపి జిల్లా అధ్యక్షులు మహంకాళి రాజన్న కోరారు. ఆయన వెంట టిడిపి రాష్ట్ర కార్యదర్శి అక్కినపెళ్లి కాశినాథం, రాష్ట్ర రైతు కార్యదర్శి చంద్ర శేఖర్, సోమా నారాయణరెడ్డి, భార్గవ రామ్, న్యాయవాది విజయ్ కుమార్, నాయకులు బత్తుల కొండయ్య, బాలకృష్ణ, కొండ శ్రీధర్, స్వర్గం వేంకటేశం, కొలుగురి ప్రసాద్ రావు, సాన రాములు తోపాటు పలువురు ఉన్నారు.