ఖమ్మం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సోమవారం ఆకస్మికంగా తణిఖీ చేసారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులను హాల్ టికెట్స్‌తో సరిపోల్చి పరిశీలించారు. మాస్ కాపీయింగ్ జరుగకుండా బాధ్యులు పర్యవేక్షించాలని ఇన్‌విజిలెటర్స్‌ను ఆదేశించారు. విద్యార్ధులకు కల్పించిన మౌళిక వసతులను పరిశీలించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు, ఉండాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికారలు, సెల్‌ఫోన్ అనుమతించరాదని, సమీపంలో ఎటువంటి జీరాక్స్ సెంటర్లు ఉండరాదని, 144 సెక్షన్ పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు కలెక్టర్ సూచించారు.