హైదరాబాద్, మార్చి19 :
ప్రతి జబ్బుకు ఒక కారణం ఉంటుంది, దానిని మందులతో తగ్గిస్తామంటే సరిపోదని నిమ్స్
కార్డియోథోరాసిక్ విభాగం మాజీ ప్రొఫెసర్,
కార్డియో రిహాబిలిటేషన్ మెటాబోలిక్ నిపుణుడు
డాక్టర్ పీవీ సత్యనారాయణ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో డైట్ అండ్ హెల్త్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.ఏ మందులు లేని రోజుల్లో
రెండవ ప్రపంచ యుద్దానికి ముందే యూకేవారు టిబి మందుని కనిపెట్టి వ్యాధిని తగ్గించారని ఆయన అన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ప్రస్తుత తరుణంలో తాము ఏమి చేయలేక పోతున్నామన్నారు.
ప్రతి జబ్బుకు ఒక కారణం ఉంటుందని, దానిని మందులతో తగ్గిస్తామంటే సరిపోదన్నారు.
కోవిడ్ రావడం వల్లనే అందరూ చనిపోలేదన్నారు.
మనం తీసుకునే ఆహారం ఎంత క్వాంటిటీ అని కాదు, క్వాలిటీ అవసరమన్నారు.
ఎన్ని మైళ్ళు నడిచినా ఆహారపు అలవాట్లలో మార్పు రాకపోతే కొవ్వు తగ్గదని, కొద్ది సేపు వ్యాయామ చేసినా కొవ్వు తగ్గుతుందన్నారు.
తక్కువ తిని ఎక్కువ నడవాలన్నారు.
గర్భిణీగా ఉన్నప్పుడు షుగర్ వస్తుందని,
తల్లి పాలు 6 నెలలైనా తాగకపోతే ఆస్తమా లాంటివి వస్తాయన్నారు.ఇన్సులిన్ కంట్రోల్ చేసుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ అంటే బాగా ఇష్టపడతాయని, గ్లూకోజ్ లేకుంటే క్యాన్సర్ కణాలు చచ్చిపోతాయన్నారు.చిరు ధాన్యాలు తిన్నా షుగర్, ఒబేసిటీ ఉంటే ప్రయోజనం లేదన్నారు.శీతల పానియాల్లో మాములు కన్నా షుగర్ ఎక్కువగా ఉంటుందన్నారు.ఉదయం, సాయంత్రం, తక్కువ ప్రొటీన్లు తినాలని,
సన్నగా ఉన్నంత మాత్రాన ఇన్సులిన్ టెస్ట్ చేసుకోకుండా వుండవద్దన్నారు. సమావేశంలో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, కార్యవర్గ సభ్యురాలు పద్మావతి, ప్రెస్ క్లబ్ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.