జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్
పెద్దపల్లి ప్రజాబలం మార్చి 8÷
సమాజంలో మార్పు జరగాలంటే స్త్రీల వల్లనే సాధ్యమవుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు బుధవారం ఇండియన్ మిషన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో 23వ వార్డు కౌన్సిలర్ తాడూరి పుష్పకళా శ్రీమాన్ తో పాటు తాడూరి శ్రీమన్నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ స్త్రీలపై సమాజంలో జరుగుతున్న లైంగిక వేధింపులకు వివక్షతకు మానసిక అణిచివేతకు ప్రభుత్వాలే కారణమని పేర్కొన్నారు. మహిళా సాధికారత విషయంలో సాధికారత విషయం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని ఆవేదన చెందారు అమలులో ఉన్న చట్టాలు సరైన మార్గంలో ఉపయోగిస్తే ఇలాంటి అఘాయిత్యాలు జరిగాయని తెలిపారు మహిళల్లో ఉన్న పోరాట స్ఫూర్తి త్యాగనిరతి సమాజ మార్పుకు దోహదం చేస్తుందని తెలిపారు మహిళలకు స్వతంత్రం ఇవ్వకపోవడం వల్లనే నేర ప్రవృత్తి పెరుగుతుందని అన్నారు పాఠశాల నుండి ఇంటి నుండి బాల్యంలోనే ఆడపిల్లల లో మానసిక ధైర్యాన్ని నింపేలా చొరవ చూపెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయరాజుతోపాటు విద్యార్థులు మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు