-మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్
రేవంత్ సర్కార్ కార్పొరేషన్ల ఏర్పాటుతో సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టిందని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజొద్దీన్ పేర్కొన్నారు. కార్పొరేషన్లతో కులాల వారీగా న్యాయం చేకూరుతుందన్నారు. వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి మర్చిపోయిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం చెప్పిన, చెప్పని హామీలను సైతం అమలు చేస్తోందన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుస్తామన్నారు.