వరంగల్ ప్రతినిధి మార్చి 13::
విద్యార్థులకు చదువుతోపాటు ఆటలు కూడా ముఖ్యమని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రెండవ అండర్ కళాశాల ఆటల పోటీలకు సంబంధించిన గోడ పత్రికను బుధవారం కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ దివ్వెల మోహన్ దాసుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ విద్యార్థిని, విద్యార్థులు వారీ యొక్క స్ట్రెస్ నుండి బయటికి రావాలంటే ఆటలు ఎంతో ఉపకరిస్తాయని సూచించారు. ఈనెల 20వ తేదీ నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు కాకతీయ మెడికల్ కళాశాల గ్రౌండ్లో నిర్వహించే ఈ పోటీలు నాలుగు విభాలుగా నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్రం మొత్తం నుండి అన్ని మెడికల్ డెంటల్ ఆయుర్వేద ఫిజియోథెరపీ, హోమియోపతి కళాశాలల నుండి విద్యార్థులు దాదాపుగా 3000 మంది వరకు పాల్గొంటారని తెలియజేశారు. మెడికల్ విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా ఈ అండర్ ఆటల పోటీలలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ సంధ్య, రామ్ కుమార్, పిడి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.