దాణాపూర్ ఎక్స్ ప్రెస్ హాల్టింగ్ తో రైల్వే ప్రయాణికులకు ఎంతో మేలు…
*ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు ధన్యవాదాలు..
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి….
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 13
కరీంనగర్ జిల్లా ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న చిరకాల వాంఛ నెరవేరిందని సికింద్రాబాద్ – దాణాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు (12791/92) జమ్మికుంటలో ఆగడం సంతోషకరమని , జమ్మికుంటలో రైలు హల్టింగ్ తో రైల్వే ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు.
దాణాపూర్ ఎక్స్ ప్రెస్ బుధవారం జమ్మికుంట రైల్వే స్టేషన్లో హాల్టింగ్ కావడంతో బిజెపి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సికింద్రాబాద్ నుండి బయలుదేరే దాణాపూర్ ఎక్స్ ప్రెస్ జమ్మికుంట మీదుగా 5 రాష్ట్రాలు ప్రయాణించి దాణపూర్. చేరుకుంటుందన్నారు .
జమ్మికుంటతో కలిసి మొత్తం 30 స్టేషన్లలో ఈరైలుఆగుతుందన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ తోపాటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ వెళ్లాలనుకునే ప్రయాణీకులకు, వర్తక వ్యాపారులకు, దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ఎంతో ఉపయోగపడనుందని, ముఖ్యంగా రైల్వే ప్రయాణికుల విలువైన సమయం డబ్బు ఆదా అవుతాయన్నారు. రైల్వే హాల్టింగ్ కోసం కృషి చేసిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కు, రైలును ఆగడానికి చర్యలు తీసుకున్న రైల్వే అధికారులు, రైల్వే మంత్రి అశ్విన్ కుమార్, ప్రధాని మోదీకి బిజెపి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణా రెడ్డి, జిల్లా ఉపాధయక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటి రెడ్డి,నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతంరెడ్డి,పట్టణ అధ్యక్షుడు జీడీ మల్లేష్,మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ఆకుల రాజేందర్,తిరుపతి శ్రీనివాస్, సంపెల్లి సంపత్ రావు,సింగిరెడ్డి తిరుపతి రెడ్డి,రామిడిఆది రెడ్డి,కోరే రవీందర్, పల్లపు రవి,పుల్లూరి ఈశ్వర్,ఠాగూర్ రాజేష్, కైలాసకోటి గణేష్,గర్రపెల్లి నిరుప రాణి తదితరులు పాల్గొన్నారు