సిమెంట్ రోడ్డు నిర్మాణం కు నాసిరకం ఇసుక

 

కాంట్రాక్టర్ తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

పంచాయతీరాజ్ శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవైందా!

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధికి మంజూరు చేసిన సిమెంట్ రోడ్ నిర్మాణం కు కావలసిన ఇసుకలో నాణ్యత లోపించిందనే పలువురు స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. మండలంలోని పెంట్లం గ్రామపంచాయతీ కంపగూడెం గ్రామంలో ప్రజా ప్రయోజనాల కై ప్రజలకు సౌకర్యవంతమైన రహదారి నిర్మించాలనే సంకల్పంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజిఎన్ఆర్ఇజిఎస్)లో నాలుగు లక్షల ఇరవై వేలు రూపాయలు తో సిమెంట్ రోడ్డు ను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రజాధనంతో నిర్మిస్తున్న ప్రభుత్వ పనులను అధికారులు తరచూ పర్యవేక్షిస్తూ కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలను పాటించే దిశగా కాంక్రీట్ పనికి సమకూర్చిన మెటీరియల్స్ ను పరిశీలించి గ్రామ అభివృద్ధి పనిని పూర్తి చేయించి.ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఎంతైనా ఉన్నప్పటికీ!.ఆదిలోనే ఆ విషయం వదిలేసారా!..అంటున్నారు కొందరు. కాంక్రీట్ పనుల్లో వాడే కంకర.ఇసుక.సిమెంట్ క్వాలిటీ గా ఉంటేనే నిర్మాణాలు కొన్నేళ్ల వరకు చెక్కుచెదరకుండా ఉంటాయనే విషయం పాఠకులందరికీ విధితమే.ఈ రోడ్డు పనిలో మాత్రం నాణ్యతతో కూడిన గోదావరి ఇసుకను తోలించి దానితో పాటు అటవీ, రెవెన్యూ ప్రాంతంలోని వాగుల్లో వంకల్లోని నాసిరకం ఇసుకను రాత్రికి రాత్రే ట్రాక్టర్లతో ట్రిప్పులు కొద్ది ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా తోలించి సమకూర్చి పెట్టుకున్నారు. అంతా గోదారి ఇసుకేనంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు.అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం మోపాలని జిల్లా ఉన్నత అధికారులు సైతం ఆదేశిస్తున్న గ్రామీణ ప్రాంతాల్లో దోచుకున్నోడికి…దోచుకున్నంత అన్న చందంగా ఇక్కడ పరిస్థితి ఉంది.కాంట్రాక్టర్ తో కుమ్మక్కవడం వలనే ఇష్టా రితిన కాసులకు కక్కుర్తి పడ్డారనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తుతున్నాయి. ఇంత తతంగం జరుగుతున్న పంచాయతీరాజ్ శాఖ అధికారుల పట్టింపులేక పర్యవేక్షణ కొరవైందా! అన్న ప్రశ్నకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చేసుకొని నాణ్యత ప్రమాణాలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టించాలని. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking