జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 13
పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుదిల్ల శ్రీధర్ బాబు కు
హుజరాబాద్ నియోజక వర్గం పెరిక సంఘం (పురగిరీ క్షత్రియ) తరపున ఎగ్గని శ్రీనివాస్ మాజీ జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నీ ప్రభుత్వాలు వచ్చిన ఏ ఒక్కరు పెరిక కులస్తులను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెరిక కులస్తులను గుర్తించి వారికి పెరికకుల పురగిరి క్షత్రియ బోర్డును ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని పెరిక కులస్తులను అర్థం చేసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పెరిక కులస్తుల అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ బోర్డు ద్వారా పేరుక కులస్తులు ఇకముందు ఆత్మవిశ్వాసంతో ఎంతో ఉన్నతమైన స్థానాలకు చేరుకుంటారని ఆశిస్తున్నాము