సంగారెడ్డి నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 25(ప్రజాబలం)సంగారెడ్డి జిల్లా/సదాశివపేట మండలంలోని వెల్టూరు గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా కిట్లను పంపిణీ చేసిన సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి,ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని రంజాన్ పండుగకు ముస్లింలకు తన వంతు సహాయంగా,తన సొంత డబ్బులతో రంజాన్ కిట్లను పంపిణీ చేయడం చాలా సంతోషకరమన్నారు.రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో, అల్లాపై ఉండే తమ యొక్క భక్తి శ్రద్ధలను చూపుతారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరుగుతుందన్నారు,ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు షబ్బీర్, నైజాం, చోటు బిఆర్ఎస్ నాయకులు సత్యం, రవి, సుందర్, పాండు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.